తొలి అడుగు డైలీ
9 Aug 2026Sundaywww.toliadugudaily.com
రూ.2.08 లక్షల జీతంతో ISROలో సైంటిస్ట్ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే? Tech News

రూ.2.08 లక్షల జీతంతో ISROలో సైంటిస్ట్ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే?

బెంగళూరులోని హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (HSFC)లో సైంటిస్ట్/ఇంజినీర్-ఎస్‌డీ గ్రూప్-ఏ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సంబంధిత విభాగాల్లో పీహెచ్‌డీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.2,08,700 వరకు జీతం లభిస్తుంది. ఈ కింది లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోండి..

భారత అంతరిక్ష సంస్థ ISRO ఆధ్వర్యంలోని బెంగళూరులోని హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (HSFC)లో గ్రూప్-ఏ కేటగిరీలోని సైంటిస్ట్/ఇంజినీర్-ఎస్‌డీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో పీహెచ్‌డీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కిద మొత్తం 6 సైంటిస్ట్/ ఇంజినీర్-ఎస్‌డీ (గ్రూప్-ఏ) పోస్టులను పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 10 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి.. పోస్టులకు సంబంధించిన పరిశోధనా విభాగాలు.. బయోఇన్‌స్ట్రుమెంటేషన్ / బయోఫిజిక్స్ / మెడికల్ ఫిజిక్స్ డెవలప్‌మెంటల్ బయాలజీ / బయోటెక్నాలజీ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ / సెల్ బయాలజీ కంప్యూటేషనల్ బయాలజీ / సిస్టమ్స్ బయాలజీ / బయోఇన్ఫర్మేటిక్స్ బయోమెడికల్ ఇంజినీరింగ్ / బయోమెడికల్ సైన్స్ ఇస్రోలో సైంటిస్ట్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టుకు సంబంధించిన స్పెషలైజేషన్‌లో విద్యార్హత కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు సంబంధిత విభాగంలో తమ విద్యార్హత సరిపోతుందో లేదో అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఆగ…