
Temple
అయోధ్య వెళ్లాలనుకుంటున్నారా? రూ.9,700తో రామ్ లల్లా దర్శనం.. IRCTC అదిరిపోయే ప్యాకేజీ!
అయోధ్యలోని రామ్ లల్లా ఆలయం, సరయూ ఘాట్, హనుమాన్ గర్హి, కనక్ భవన్ దర్శనానికి IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. వందే భారత్ రైలులో ప్రయాణం, హోటల్ బస, భోజనాలతో రూ.9,700 నుంచే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
IRCTC Ayodhya Tour Package Telugu: భారతదేశంలోని అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అయోధ్యకు వెళ్లి శ్రీరాముడి జన్మస్థలాన్ని దర్శించాలని భావిస్తున్న భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. “రామ్ లల్లా దర్శన్ అయోధ్య” పేరుతో నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల ప్యాకేజీలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం, హోటల్ బస, భోజనాలు, స్థానిక దర్శనాలు అన్నీ కలిపి అందిస్తున్నారు. అయోధ్య ప్రత్యేకత ఉత్తరప్రదేశ్‌లోని సరయూ నది తీరాన ఉన్న అయోధ్య హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. శ్రీరాముడి జన్మస్థలంగా ప్రసిద్ధి చెందిన ఈ నగరం రామాయణంతో విడదీయరాని అనుబంధం కలిగి ఉంది. ప్రాచీన కోసల రాజ్యానికి రాజధానిగా ఉన్న అయోధ్యను హిందూ సంప్రదాయంలోని సప్త మోక్షపురిలలో ఒకటిగా భావిస్తారు. ప్యాకేజీ వివరాలు ప్యాకేజీ పేరు: రామ్ లల్లా దర్శన్ అయోధ్య ప్రయాణ విధానం: రైలు (వందే భారత్ ఎక్స్‌ప్రెస్) బయలుదేరే స్టేషన్: ఆనంద్ విహార్ టెర్మినల్ (ఢిల్లీ) ప్రయాణ సమయం: ఉదయం 6:10 గంటలకు రైలు క్లాస్: చెయిర్ కార్ (CC) టూర్ నిర్వహణ: ప్రతి శుక్రవారం, శనివారం వసతి: హోటల్ తారాజీ రిసార్ట్ లేదా సమాన స్థాయి హోటల్ భోజనాలు: వెజిటేరియన్ భోజనం (ప్యాకేజీ ప్రకారం) దర్శించే ప్రముఖ ప్రదేశాలు ఈ ప్యాకేజీలో భక్తులు కింది ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంద…