తొలి అడుగు డైలీ
9 Aug 2026Sundaywww.toliadugudaily.com
ఓటీటీలో దుమ్మురేపుతోన్న నాగదుర్గ సినిమా.. ఇండియా వైడ్‌గా టాప్‌లో ట్రెండింగ్.. ఎక్కడ చూడొచ్చంటే? OTT

ఓటీటీలో దుమ్మురేపుతోన్న నాగదుర్గ సినిమా.. ఇండియా వైడ్‌గా టాప్‌లో ట్రెండింగ్.. ఎక్కడ చూడొచ్చంటే?

తెలంగాణకు చెందిన ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైంది. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది.

ఎప్పటిలాగే ఈ వారం దాదాపు 25కు పైగా సినిమాలు, సిరీస్ లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. అందులో అఖిల్ అక్కినేని లెనిన్, సుకుమారి, హృదయం మురళి (ఇదయం మురళి), వంద దేవుళ్లు (నూరు సామి), మై వాసప్ ఆవుంగా లాంటి హిట్ సినిమాలు ఉన్నాయి. అలాగే ఆపరేషన్ సఫేద్ సాగర్, వదంది 2 లాంటి డబ్బింగ్ సిరీస్‌లు కూడా ఈ వీకెండ్ లోనే స్ట్రీమింగ్ కు రానున్నాయి. అయితే వీటికంటే ముందు ఓ సినిమా ఇప్పుడు ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అదే ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ నటించిన మొదటి సినిమా ‘లవ్‌ ఓ లవ్‌’. ఇందులో కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ మేనల్లుడు పవీస్‌ నారాయణన్‌ హీరోగా నటించాడు. అలాగే సెల్వరాఘవన్‌, వనితా విజయ్‌ కుమార్‌, కేఎస్‌ రవికుమార్‌ కీలక పాత్రలు పోషించారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా జులై 10న థియేటర్లలో విడుదలైంది. జస్ట్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. యూత్ మాత్రం ఈ సినిమాను బాగానే ఎంజాయ్ చేశారు. అయితే ఇప్పుడీ సినిమా ఓటీటీలో దుమ్ము రేపుతోంది. గత వారమే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చేసిన నాగదుర్గ సినిమా ఇప్పుడు టాప్ లో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు ప్రైమ్ వీడియోస్ ఓటీటీలో ఇండియా వైడ్‌గా మొదటి స్థానంలో దూసుకుపోతోంది. బహుశా నాగదుర్గ క్రేజ్‌ దీనికి కారణమని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం అమెజాన్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ లిస్ట్ ను ఒకసారి పరిశీలిస్తే.. రెండో స్థానంలో హాలీవుడ్‌ మూవీ ‘ది డెవిల్స్ మ…