
Cinema News
‘రామాయణ’లో సీత లుక్స్‌పై ట్రోల్స్.. కాస్ట్యూమ్ డిజైనర్ల రియాక్షన్ ఏంటంటే?
"ప్రతి భారతీయుడి మనసులో రామాయణానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కాబట్టి నటీనటుల ఎంపిక, దుస్తులు లేదా వీఎఫ్ఎక్స్ (VFX)పై ప్రజలకు భిన్నమైన అభిప్రాయాలు ఉండటం సహజం. కానీ ఈ స్థాయిలో వ్యతిరేకత వస్తుందని మేము ఊహించలేదు," అని రామాయణ చిత్ర కాస్ట్యూమ్ డిజైనర్ పేర్కొన్నారు.
ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో, రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘ రామాయణం’. ఇటీవలే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటికే 800 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ఈ ఘనత సాధించిన అతికొద్ది సినిమాల్లో ఒకటిగా రామాయణం మూవీ నిలిచింది. అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదలైన వెంటనే ఈ చిత్రంలోని పాత్రల వస్త్రధారణపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, చర్చలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా సీత పాత్ర పోషించిన సాయి పల్లవి బ్లౌజ్ డిజైన్, కైకేయి పాత్ర పోషించిన లారా దత్తా చీరల డిజైన్ పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇవి టీవీ సీరియల్‌లోని పాత్రలా కనిపిస్తున్నాయని నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.పౌరాణిక చిత్రాల విషయంలో ఇలాంటి విమర్శలను ఎదుర్కోవడం సహజమే అయినా ఈ ట్రోలింగ్ పట్ల రామయాణం కాస్ట్యూమ్ డిజైనర్స్ స్పందించారు. ఇప్పుడు, ఈ విమర్శలన్నింటికీ చిత్ర కాస్ట్యూమ్ డిజైనర్లు రింపిల్ హర్‌ప్రీత్ నారులా సరైన వివరణ ఇచ్చారు. సాయి పల్లవి వస్త్రధారణపై వచ్చిన విమర్శలపై కాస్ట్యూమ్ డిజైనర్లు స్పందిస్తూ..’ఇలాంటి విమర్శలు, పోలికలు వస్తాయని మాకు తెలుసు. రామాయణం లాంటి ఇతిహాసాన్ని తరతరాలుగా మనం చూస్తున్నాం. కాస్టింగ్, కాస్ట్యూమ్స్‌పై ఎప్పుడూ అభిప్రాయాలు ఉంటాయి. అవి అంగీకరించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. కళ్లు మూసుకుని సీతాదేవిని ఊహించుకొని నేను పురావస్తు ప్రామాణికత గ…