తొలి అడుగు డైలీ
9 Aug 2026Sundaywww.toliadugudaily.com
శివుని త్రిశూలంలోని మూడు కొమ్ముల అర్థం తెలుసా? శ్రావణ మాసంలో తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక రహస్యాలు Devotional News

శివుని త్రిశూలంలోని మూడు కొమ్ముల అర్థం తెలుసా? శ్రావణ మాసంలో తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక రహస్యాలు

వుని చేతిలో కనిపించే త్రిశూలం కేవలం ఆయుధం మాత్రమే కాదు. సత్వ, రజో, తమో గుణాలు, మూడు కాలాలు, సృష్టి-స్థితి-లయ వంటి ఆధ్యాత్మిక తత్వాలకు ప్రతీకగా భావించే త్రిశూలంలోని మూడు కొమ్ముల అసలు అర్థం ఏమిటో వివరంగా తెలుసుకోండి.

ఈ సంవత్సరం పవిత్రమైన శ్రావణ మాసం జూలై 30న ప్రారంభమవుతోంది. హిందూ సంప్రదాయంలో ఈ మాసాన్ని శివారాధనకు అత్యంత పవిత్రమైన కాలంగా భావిస్తారు. ఈ సమయంలో భక్తులు ఉపవాసాలు, అభిషేకాలు, రుద్రపారాయణం, బిల్వార్చన వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ పరమశివుని అనుగ్రహం కోరుకుంటారు. శివుని రూపంలో కనిపించే ప్రతి చిహ్నానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సందేశం ఉంటుంది. అందులో ముఖ్యమైనది త్రిశూలం. శివుని చేతిలో ఎల్లప్పుడూ కనిపించే త్రిశూలం కేవలం ఒక ఆయుధం మాత్రమే కాదు. ఇది సృష్టి తత్వాన్ని, జీవన సత్యాలను, ఆధ్యాత్మిక మార్గాన్ని తెలియజేసే గొప్ప ప్రతీకగా పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తాయి. ముఖ్యంగా త్రిశూలంలోని మూడు కొమ్ముల(మొనల)కు అనేక ఆధ్యాత్మిక అర్థాలు ఉన్నాయని విశ్వాసం. త్రిశూలంలోని మూడు కొమ్ములు దేనికి ప్రతీక? హిందూ తత్వశాస్త్రం ప్రకారం త్రిశూలంలోని మూడు కొమ్ములు సత్వ, రజో, తమో గుణాలకు ప్రతీకలుగా భావిస్తారు. సత్వ గుణం – జ్ఞానం, శాంతి, పవిత్రత, సత్యం. రజో గుణం – కర్మ, చైతన్యం, కోరికలు, కార్యాచరణ. తమో గుణం – అజ్ఞానం, సోమరితనం, మోహం, జడత్వం. ఈ మూడు గుణాలే ప్రతి మనిషి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయని శాస్త్రాలు చెబుతాయి. అయితే పరమశివుడు ఈ మూడు గుణాలకు అతీతుడు. అందుకే ఆయన చేతిలోని త్రిశూలం ఈ మూడు శక్తులపై ఆయనకు ఉన్న సంపూర్ణ నియంత్రణకు ప్రతీకగా భావిస్తారు. ప్రపంచంలోని ఏకైక ఆలయం.. ఒకే శివలింగంలో శివుడు-విష…