తొలి అడుగు డైలీ
9 Aug 2026Sundaywww.toliadugudaily.com
తొలిసారి వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారా?.. ఈ లిస్ట్ దగ్గరుంచుకోవాల్సిందే! Devotional News

తొలిసారి వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారా?.. ఈ లిస్ట్ దగ్గరుంచుకోవాల్సిందే!

శ్రావణ మాసంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో వరలక్ష్మీ వ్రతం ఒకటి. ఈ రోజున మహాలక్ష్మీ దేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే ఐశ్వర్యం, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం, అష్టలక్ష్ముల అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా వివాహిత మహిళలు ఈ వ్రతాన్ని ఎంతో భక్తితో ఆచరిస్తారు. అయితే తొలిసారి వ్రతం చేసేవారికి ఏ పూజా సామగ్రి కావాలి? కలశాన్ని ఎలా ఏర్పాటు చేయాలి? పూజను ఏ క్రమంలో చేయాలి? అనే సందేహాలు ఉంటాయి.

వరలక్ష్మీ వ్రతం ఎంతో వైభవంగా చేసినా, ఎంతో సింపుల్‌గా ఇంట్లో చేసినా భక్తి, శ్రద్ధే ముఖ్యమని పండితులు చెబుతున్నారు. ముందుగా ఇంటిని శుభ్రం చేసి, పూజా స్థలాన్ని సిద్ధం చేసి, కలశాన్ని ప్రతిష్ఠించి, మహాలక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ నిర్వహిస్తారు. మరి ఈ పూజకు అవసరమైన సామగ్రి, పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. వరలక్ష్మీ పూజకు కావాల్సిన సామగ్రి కలశం (వెండి, రాగి లేదా పిత్తళి) బియ్యం కొబ్బరికాయ మామిడి ఆకులు లక్ష్మీదేవి ముఖవస్త్రం లేదా విగ్రహం పసుపు, కుంకుమ, గంధం అక్షింతలు పూలు, పూలమాలలు తమలపాకులు, వక్కలు పండ్లు కొబ్బరికాయ దీపం, వత్తులు, నెయ్యి లేదా నూనె ధూపం, అగరుబత్తులు నైవేద్యం (పాయసం, లడ్డూ, పులిహోర లేదా ఇంట్లో తయారు చేసిన ప్రసాదం) తోరం (తొమ్మిది ముడులతో) కొత్త చీర లేదా వస్త్రం. 2. కలశ స్థాపన ఎలా చేయాలి? ముందుగా పీటపై బియ్యం వేసి దానిపై కలశాన్ని ఉంచాలి. కలశంలో కొద్దిగా బియ్యం, నాణేలు లేదా పంచధాన్యాలు ఉంచి నీరు పోయాలి. తర్వాత మామిడి ఆకులు అమర్చి, పసుపు రాసిన కొబ్బరికాయను ఉంచాలి. దానిపై లక్ష్మీదేవి ముఖవస్త్రాన్ని అలంకరించి పూలతో అందంగా అలంకరించాలి. 3. పూజా విధానం ముందుగా గణపతి పూజ చేసి విఘ్నాలు తొలగించాలని ప్రార్థించాలి. అనంతరం సంకల్పం చేసి మహాలక్ష్మీదేవిని కలశంలో ఆవాహన చేయాలి. పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు సమర్పించి అష్టోత్తర శతనామావళి లేదా శ్రీ సూక్తం పారాయణం చేయాలి. త…